LOADING...
Telangana : సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు.. తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు
సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు.. తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు

Telangana : సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు.. తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2026
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినిమా టికెట్ ధరల పెంపు అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏ సినిమా విడుదలకైనా కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో మార్పులు అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో దర్శకుడు 'శంకర వర ప్రసాద్' సినిమాకు సంబంధించి టికెట్ ధరల పెంపుపై తీవ్ర వివాదం నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేశారన్న ఆరోపణలతో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు అయింది. టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Details

90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు

పిటిషన్‌లో టికెట్ ధరల పెంపు వల్ల సాధారణ ప్రేక్షకులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని, నిర్మాతలు అనధికారికంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే స్పష్టమైన గడువు లేకుండా టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇవ్వడం చట్టవిరుద్ధమని వాదించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, హోంశాఖ ప్రధాన కార్యదర్శికి కీలక నోటీసులు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు, సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Details

పారదర్శకత ఉండాలన్న కోర్టు ఆదేశాలు

హైకోర్టు తీర్పు సినిమా పరిశ్రమలో కీలక పరిణామంగా మారింది. సినిమా టికెట్ ధరల పెంపుపై స్పష్టత, పారదర్శకత ఉండాలన్న కోర్టు ఆదేశాలు రానున్న రోజుల్లో మార్గదర్శకంగా నిలవనున్నాయి. అయితే నైజాంలో విడుదలయ్యే భారీ బడ్జెట్ సినిమాలకు ఇకపై టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుకూల పరిస్థితులు ఉంటాయా లేదా అన్న అంశంపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది.

Advertisement