LOADING...
TG High Court: సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై పోలీసులు, మేజిస్ట్రేట్‌ కోర్టులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ
పోలీసులు, మేజిస్ట్రేట్‌ కోర్టులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ

TG High Court: సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై పోలీసులు, మేజిస్ట్రేట్‌ కోర్టులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక భావనలు వ్యక్తం చేయడంపై వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా కేసులు నేరుగా నమోదు చేయకూడదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వలం విమర్శనాత్మక అంశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారన్న కారణంగా క్రిమినల్‌ చర్యలు కొనసాగించడానికి వీల్లేదని తెలిపింది. పరువు నష్టం, ద్వేషభరిత ప్రసంగం, హింసను ప్రేరేపించడం, శాంతి భద్రతలకు భంగమనే ఆరోపణలు ఉంటే తప్ప ప్రాథమిక విచారణ కొనసాగించి చట్టబద్ధమైన అంశాలు ఉన్నాయో లేదో నిర్ధారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

వివరాలు 

నల్లబాలుపై నమోదైన కేసులు కొట్టివేసిన హై కోర్టు 

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసారని వచ్చిన ఫిర్యాదుల మేరకు రామగుండం, కరీంనగర్ పోలీసులు నమోదు చేసిన 3 కేసులను తొలగించాలని నల్లబాలు ఎలియాస్ దుర్గం శశిధర్ గౌడ్ హైకోర్టులో పిటిషన్‌ ధాఖలు చేశారు. జస్టిస్ ఎన్టుకారాంజీ విచారించిన తరువాత, బుధవారం తీర్పు వెలువరిస్తూ నల్లబాలుపై నమోదైన కేసులను కొట్టివేశారు.

వివరాలు 

కోర్టు తీర్పులో పేర్కొన్న ముఖ్య మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి: 

ఎఫ్‌ఐఆర్‌ నమోదు: పరువు నష్టం ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసులు నేరుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకూడదు. మేజిస్ట్రేట్ ఆదేశం ప్రకారం చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. తీవ్ర నేరాలకు సంబంధం లేని ఫిర్యాదులు: పోలీసుల ప్రాథమిక విచారణకు సంబంధం లేని, ఇతరుల తరఫున వచ్చిన ఫిర్యాదులను విచారించనవసరం లేదు. ప్రాథమిక విచారణ: తీవ్రమైన నేరాలకు కేసు నమోదు చేసేముందు, పోలీసు వారు చట్టబద్ధమైన అంశాల ఉనికిని నిర్ధారించాలి. హింస, ద్వేష, అశాంతి ఆధారాలు: హింసను ప్రేరేపించే, ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉంటే తప్పే కేసులు నమోదు చేయాలి.

వివరాలు 

కోర్టు తీర్పులో పేర్కొన్న ముఖ్య మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి: 

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు: కేదార్‌నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ కేసులో ఉన్న మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో పాటించాలని స్పష్టం చేసింది. రాజకీయ విమర్శలపై పరిమితి: విమర్శాత్మక రాజకీయ ప్రసంగాలపై యాంత్రికంగా కేసులు నమోదు చేయడం తప్పు. హింసను ప్రేరేపించే, శాంతి భద్రతలకు ముప్పు కలిగించే సందర్భాల్లో మాత్రమే చట్టాన్ని అమలు చేయాలి. రాజ్యాంగ పరిరక్షణ: అధికరణ 19(1)(ఎ) ప్రకారం సాధారణ రాజకీయ విమర్శలకు రాజ్యాంగ పరిరక్షణను అందించాల్సిన బాధ్యత ఉంది. అరెస్ట్‌లు చేయడం: యాంత్రికంగా అరెస్ట్‌లు చేయకూడదు. ప్రతి సందర్భంలోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయం: రాజకీయ/సున్నితమైన వ్యక్తీకరణకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయాన్ని తీసుకోవాలి.

వివరాలు 

మార్గదర్శకాలు ప్రాథమిక హక్కులను అమలు చేయడంలో సహాయపడతాయి: హై కోర్టు 

ఫిర్యాదుల సరైన మూల్యం: రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులు పనికిమాలినవని తేలినపుడు, దర్యాప్తు ప్రారంభించకూడదని, కేసును మూసివేయాలని స్పష్టం చేశారు. ఈ మార్గదర్శకాలు ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తూ, పోలీస్‌,మేజిస్ట్రేట్ కోర్టులకు విచారణ విధానాన్ని సమంజసంగా, సమతుల్యంగా అమలు చేయడంలో సహాయపడతాయని హైకోర్టు నిర్ణయించింది.