Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. తొమ్మిది గేట్లను ఎత్తిన అధికారులు..
ఈ వార్తాకథనం ఏంటి
ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద జల ప్రవాహం పెరుగుతోంది. ఈ కారణంగా అధికారులు ప్రాజెక్ట్‌లోని తొమ్మిది గేట్లను సుమారు 10 అడుగుల మేర ఎత్తి,నీటిని దిగువ వైపుకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి 2,74,697 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. జూరాల,సుంకేశుల ప్రాంతాల నుంచి భారీగా వరదలు కొనసాగుతుందన్న అధికారులు 3,05,553 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనివల్ల వరద జలాలు నాగార్జునసాగర్ వైపు మళ్ళిపోతోన్నాయి. జలాశయానికి పూర్తి నిల్వ స్థాయి 885 అడుగులుగా ఉన్నప్పటికీ,ప్రస్తుతానికి నీటిమట్టం 881.70 అడుగుల వద్ద ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు కాగా,ప్రస్తుతానికి 197.4617 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలోనూ విద్యుత్ ఉత్పత్తి నిరంతరం కొనసాగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి
— TNews Telugu (@TNewsTelugu) August 18, 2025
9 గేట్లు పది అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్న అధికారులు pic.twitter.com/rP8PIrEidE