
PM Modi: సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నివాసంలో హై లెవల్ భద్రతా సమీక్ష
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం ప్రారంభమైంది.
ఈ కీలక భేటీలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.
ఇటీవల భారత్-పాక్ మధ్య పరస్పర చర్చల అనంతరం కాల్పుల విరమణను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందాన్ని పాకిస్థాన్ కొద్దిసేపటికే ఉల్లంఘించింది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈ అత్యున్నత భద్రతా సమీక్ష సమావేశం జరుగుతోంది.
Details
మరికొద్దిసేపట్లో అధికారిక ప్రకటన
ఈ సమావేశంలో ప్రధానంగా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశముంది.
అలాగే కాల్పుల విరమణపై పాకిస్థాన్ వైఖరి, భారత్ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా విశ్లేషణ జరగనుంది.
తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ, రక్షణ శాఖలు సంయుక్తంగా ప్రెస్ బ్రీఫింగ్‌కు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
మరికొద్దిసేపట్లో ఈ అంశాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.