Lok Sabha: దేశంలో అత్యధిక ఓటర్లు మల్కాజిగిరిలో.. లక్షద్వీప్‌లో అత్యల్పం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉందని, దీని వల్ల అధిక ఓటర్లున్న నియోజకవర్గాల ఎంపీలు ప్రజలకు సమర్థవంతంగా సేవలందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్యను సమతుల్యం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా కొన్ని లోక్‌సభ స్థానాల్లో ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉంది. ఐదు నియోజకవర్గాల్లో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా, రెండు స్థానాల్లో ఈ సంఖ్య 30 లక్షలకు కూడా మించిపోయింది.
వివరాలు
గాజియాబాద్‌లో 29.48 లక్షల మంది
తెలంగాణలోని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం దేశంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గంగా నిలిచింది. ఇక్కడ మొత్తం 37.80 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కర్ణాటకలోని బెంగళూరు నార్త్ నియోజకవర్గంలో 32.15 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో 29.48 లక్షలు, గౌతమ్ బుద్ధ నగర్‌లో 26.82 లక్షలు, వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో 25.92 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలా ఉండగా, కొన్ని పార్లమెంటరీ స్థానాల్లో ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అత్యల్ప ఓటర్లున్న నియోజకవర్గంగా లక్షద్వీప్ నిలిచింది,
వివరాలలు
లడాఖ్‌లో 1.9 లక్షమంది ఓటర్లు
అక్కడ కేవలం 58 వేల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. అలాగే దమన్ అండ్ దీవ్‌లో 1.34 లక్షలు, లడాఖ్‌లో 1.9 లక్షలు, దాద్రా నగర్ హవేలీలో 2.83 లక్షలు, అండమాన్ నికోబార్ దీవుల్లో 3.15 లక్షల ఓటర్లు ఉన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ పూర్తయ్యాక ఈ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో మరింత మార్పులు వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.