
తెలంగాణ బడ్జెట్ 2023లో హైలెట్స్: శాఖల వారీగా కేటాయింపులు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ బడ్జెట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 2022-23లో సాధించిన ప్రగతిని, వచ్చే ఏడాది చేయనున్న అభివృద్ధి, కేటాయింపులను అసెంబ్లీలో ప్రకటించారు. హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హైలెట్స్‌ను ఓసారి చూద్దాం.
2014నుంచి నుంచి ప్రతి ఏడాది దేశ వృద్ధిరేటు కంటే ఎక్కువగా నమోదువతున్నట్లు మంత్రి ప్రకటించారు. 2017-18నుంచి2021-22 ఆర్థిక సంవత్సరాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తలసరి ఆదాయం వృద్ధిరేటు 11శాతంగా నమోదైనట్లు వెల్లడించారు.
తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు
మూలధన వ్యయం రూ.2,11,685కోట్లు
మూలధన వ్యయం రూ.37,525
వ్యవసాయం రంగానికి రూ.26,831కోట్లు
నీటి పారుదల రంగానికి రూ. 26,885కోట్లు
విద్యాశాఖకు రూ. 19,093కోట్లు
పురపాలక శాకకు రూ. 11, 327 కోట్లు
తెలంగాణ
జీఎస్డీపీ సగటులో దేశంలోనే తెలంగాణ 3వ స్థానం: ఆర్థిక మంత్రి
2014లో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1శాతంగా ఉండగా, 2020-21 నాటికి 4.9శాతానికి పెరిగినట్లు పేర్కొన్నారు. 2015- 2022 మధ్య కాలంలో 12.6శాతం జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధి రేటు సాధించి తెలంగాణ దేశంలో 3వ స్థానంలో నిలిచినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
ఆర్థిక శాఖకు రూ. 49,749 కోట్లు
పల్లె ప్రగతి, పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426కోట్లు
డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి రూ.12వేల కోట్లు
హోంశాఖకు రూ 9,599కోట్లు
దళిత బంధుకు రూ.17,700కోట్లు
ఆసరా పింఛన్లకు రూ. 12,000కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు
శ్రీ ఆరోగ్య శ్రీ కోసం రూ.1,101కోట్లు
బీసీల సంక్షేమానికి రూ.6,229కోట్లు
ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్లకోసం రూ. 400కోట్లు