Page Loader
శ్రీనగర్‌- బారాముల్లా హైవేపై భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం 
శ్రీనగర్‌- బారాముల్లా హైవేపై భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం

శ్రీనగర్‌- బారాముల్లా హైవేపై భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం 

వ్రాసిన వారు Stalin
Jul 31, 2023
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఉదయం శ్రీనగర్‌ నుంచి బారాముల్లా వెళ్లే జాతీయ రహదారిపై పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. నిత్యం రద్దీగా ఉండే, ఫ్లై ఓవర్‌పై పేలుడు పదార్థాలు లభ్యమవడంపై ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకంటిచారు. పోలీసులు, ఆర్మీ సిబ్బంది సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆ ప్రాంతానికి వచ్చే రహదారిని మూసివేశారు. బాంబు స్క్వాడ్ వెంటనే పేలుడు పదారార్ధాలను నిర్వీర్యం చేశాయి. అనంతరం వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. లభ్యమైన పేలుడు పదార్థం ఐఈడీ(ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)గా అనుమానిస్తున్నారు. భద్రతా బలగాల తరలింపునకు సైన్యం పేలుడు పదార్థాలు లభించిన ఫ్లైవర్ ఓవర్‌నే ఉపయోగిస్తుంది. వాటిని స్వాధీనం చేసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తున్న దృశ్యం