Himachal Pradesh : క్లౌడ్ బరస్ట్.. 13 మంది మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు ఒకటో తేదీన క్లౌడ్ బరస్ట్ వల్ల పదుల సంఖ్యలో వరద నీటిలో గల్లంతైన విషయం తెలిసిందే.
ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.
తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లోహిమాచల్ ప్రదేశ్‌ని శ్రీఖండ్ సమీపంలో, సుమేజ్, బాగీ వంతెనల సమీపంలో బుధవారం రాత్రి క్లౌడ్ బరస్ట్ జరిగింది.
ఈ ఘటన వల్ల 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొ 45 మంది గల్లంతయ్యారు.
Details
సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం
ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం మోహరించింది. మరోవైపు ఐఎండీ భారీ వర్షపాత హెచ్చరికలను జారీ చేసింది.
NDRF బృందాలను వెంటనే హిమాచల్ ప్రదేశ్‌కు పంపినట్లు సింగ్ పేర్కొన్నారు. క్లౌడ్‌బర్స్ట్‌ను "భారీ విపత్తు"గా అభివర్ణించారు.
ఇప్పటివరకు తొమ్మిది మృతదేహాలు లభ్యమయ్యాయని, గల్లంతైన వారందరి ఆచూకీ లభించే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు.
గత 24 గంటల్లో మండి జిల్లాలోని జోగిందర్ నగర్‌లో అత్యధికంగా 110మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఆయన తెలిపారు.