LOADING...
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సెప్టెంబరు 7 వరకు స్కూల్స్ బంద్ 
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సెప్టెంబరు 7 వరకు స్కూల్స్ బంద్

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సెప్టెంబరు 7 వరకు స్కూల్స్ బంద్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు 2025 సెప్టెంబరు 7 వరకు సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు ప్రభుత్వ,ప్రైవేట్ స్కూల్స్ అన్ని విధాల అమలులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు స్కూల్స్ మూసివేయాలని ఆదేశించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రాకేష్ కవర్ అధికారిక ఆదేశాన్ని జారీచేశారు. అన్ని స్కూల్స్, కళాశాలలు,ఇతర విద్యాసంస్థలు సెప్టెంబరు 7 వరకు మూసివేయాలని సూచించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెప్టెంబరు 7 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో స్కూల్స్ బంద్