'హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు ఆధారల్లేవు'; అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్
అదానీ గ్రూప్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల బృందం క్లీన్‌చిట్ ఇచ్చింది. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కంపెనీ, ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికను శుక్రవారం అత్యున్నత న్యాయస్థానానికి అందజేసింది. అదానీ గ్రూప్‌లో ఎలాంటి డొల్ల కంపెనీలు లేవని, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణుల కమిటీ తేల్చేసింది. మరోవైపు నియంత్రణ సంస్థ సెబీ తన స్వంత దర్యాప్తును పూర్తిచేయాలని ఆరుగురు సభ్యలతో కూడిన నిపుణుల బృందం వెల్లడించింది. గౌతమ్ అదానీకి చెందిన కంపెనీల స్టాక్‌ల ధరల్లో అవకతవకలు స్పష్టంగా కనిపించలేదని పేర్కొంది. సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ నివేదకతో గౌతమ్ అదానికి పెద్ద ఊరట లభించింది.