India 1947 to 2026: 1947 నుంచి 2026 వరకు దేశ గతిని మార్చిన 80 కీలక మైలురాళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
1947 ఆగస్టు 15 అర్ధరాత్రి భారతదేశం స్వాతంత్య్రాన్ని అందుకుంది. అయితే, ఆ సమయంలో కొత్తగా స్వేచ్ఛ పొందిన దేశం ముందున్న సవాళ్లు ఎన్నో. దేశ విభజనతో ఏర్పడిన తీవ్ర గాయాలు, లక్షలాది మంది కాదు.. కోట్లాది మంది శరణార్థుల దుఃఖం, బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, విస్తృత నిరక్షరాస్యత, తీవ్ర పేదరికం.. ఇలా అనేక సమస్యలు దేశాన్ని చుట్టుముట్టాయి. అంతేకాదు.. భిన్నమైన భాషలు, మతాలు, కులాలు, ప్రాంతాలు కలిగిన భారతదేశం ఏకంగా నిలబడగలదా? అనే సందేహాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి. పరిమిత వనరులతో, అనేక అంతర్గత సమస్యలతో ఉన్న భారత్ ఎక్కువ కాలం ఐక్యంగా ఉండలేదని కొందరు పాశ్చాత్య విశ్లేషకులు అంచనా వేశారు.
వివరాలు
ప్రయాణం సాగిందిలా..
కానీ ఆ అంచనాలను భారతదేశం తన ప్రయాణంతోనే తిప్పికొట్టింది.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంటూ దేశం ముందుకు సాగింది.
ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసుకుంది. సార్వభౌమాధికారాన్ని, జాతీయ సమగ్రతను కాపాడుకుంటూనే ప్రపంచంలో ప్రభావవంతమైన శక్తిగా ఎదిగింది.
2026లో భారత్ 80వ స్వాతంత్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో.. స్వాతంత్యం అనంతరం దేశ చరిత్ర, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర సాంకేతిక రంగం, క్రీడలు, సినిమా, అంతరిక్ష పరిశోధనలు తదితర రంగాలపై చెరగని ముద్ర వేసిన 80 కీలక ఘట్టాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
వివరాలు
చెరగని ముద్ర వేసిన 80 కీలక ఘట్టాలు..
1. 1947: స్వాతంత్రం ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి భారత్ విముక్తి పొంది స్వతంత్ర దేశంగా అవతరించింది.
2. 1948: మహాత్మా గాంధీ హత్య
జనవరి 30న జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
3. 1948: ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం
స్వాతంత్రం తర్వాత భారత్ ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది.
4. 1950: రాజ్యాంగం అమల్లోకి
జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో దేశం గణతంత్ర రాజ్యంగా మారింది.
5. 1951: తొలి ఐఐటీ దేశంలో ఉన్నత సాంకేతిక విద్యకు బలమైన పునాది వేస్తూ తొలి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ప్రారంభమైంది.
వివరాలు
ఆసియా క్రీడలకు భారత్ ఆతిథ్యం..
6. 1951: ఆసియా క్రీడలకు భారత్ ఆతిథ్యం
న్యూఢిల్లీలో తొలి ఆసియా క్రీడలను భారత్ నిర్వహించింది.
7. 1951-52: తొలి సార్వత్రిక ఎన్నికలు
స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.
8. 1952: టెస్ట్ క్రికెట్‌లో తొలి విజయం
టెస్ట్ క్రికెట్‌లో భారత్ తన తొలి విజయాన్ని నమోదు చేసింది.
9. 1955: 'పథేర్ పాంచాలి' విడుదల
సత్యజిత్ రే దర్శకత్వంలో రూపొందిన 'పథేర్ పాంచాలి' విడుదలై భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.
10. 1956: ఢిల్లీలో AIIMS ఏర్పాటు
దేశంలో అత్యున్నత వైద్య విద్య, వైద్య సేవలకు కీలక సంస్థగా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఢిల్లీలో ఏర్పాటైంది.
వివరాలు
భారత్, చైనాల మధ్య యుద్ధం..
11. 1956: రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ
భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేపట్టబడింది.
12. 1957: జాతీయ క్యాలెండర్‌కు ఆమోదం
'రాష్ట్రీయ పంచాంగ్'గా పిలిచే జాతీయ క్యాలెండర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
13. 1959: టెలివిజన్ ప్రసారాలకు శ్రీకారం
భారతదేశంలో టెలివిజన్ సేవలు తొలిసారిగా ప్రారంభమయ్యాయి.
14. 1959: కేరళ ప్రభుత్వం రద్దు
కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసింది. భారత రాజకీయ చరిత్రలో ఇది కీలక పరిణామంగా నిలిచింది.
15. 1960: సూపర్‌కంప్యూటర్‌కు నాంది
దేశంలో సూపర్‌కంప్యూటింగ్ రంగానికి సంబంధించిన ప్రారంభ ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి.
16. 1962: భారత్-చైనా యుద్ధం
సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్, చైనాల మధ్య యుద్ధం జరిగింది.
వివరాలు
సౌండింగ్ రాకెట్ ప్రయోగం..
17. 1963: సౌండింగ్ రాకెట్ ప్రయోగం
భారత్ అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక అడుగు వేస్తూ సౌండింగ్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది.
18. 1964: నెహ్రూ కన్నుమూత
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మే 27న మరణించారు.
19. 1965: భారత్-పాక్ యుద్ధం
భారత్, పాకిస్థాన్ మధ్య మరోసారి యుద్ధం జరిగింది.
20. 1966: లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణం
ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్‌లో ఆకస్మికంగా కన్నుమూశారు.
21. 1967: కాంగ్రెసేతర రాజకీయాల బలం పెరగడం
దేశ రాజకీయాల్లో కాంగ్రెసేతర శక్తులు గణనీయంగా ఎదగడం ప్రారంభమైంది. 'గైర్-కాంగ్రెస్‌వాదం' బలపడింది.
22. 1969: (ISRO) ఏర్పడింది. దేశ అంతరిక్ష ప్రయాణానికి ఇది కీలక మలుపుగా నిలిచింది.
వివరాలు
భారత్-పాక్ యుద్ధం..
23. 1969: కాంగ్రెస్‌లో చీలిక
కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోవడం దేశ రాజకీయాల్లో పెద్ద పరిణామంగా మారింది.
24. 1969: బ్యాంకుల జాతీయీకరణ
ప్రధాన వాణిజ్య బ్యాంకులను జాతీయీకరించడం ద్వారా బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది.
25. 1970: శ్వేత విప్లవానికి శ్రీకారం
పాల ఉత్పత్తిని భారీగా పెంచే లక్ష్యంతో 'వైట్ రివల్యూషన్' లేదా శ్వేత విప్లవం ప్రారంభమైంది.
26. 1971: ఇందిరాగాంధీకి ఘన విజయం
లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేసింది.
27. 1971: భారత్-పాక్ యుద్ధం..
బంగ్లాదేశ్ ఆవిర్భావం భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. అనంతరం తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది.