Page Loader
Bomb Threat: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

Bomb Threat: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉన్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి విమానాశ్రయ భద్రతా విభాగానికి ఒక ఈమెయిల్ వచ్చింది. దానిలో పంపిన వ్యక్తి తాను ఉగ్రవాది అని పేర్కొంటూ, ఎయిర్‌పోర్టులో రెండు బాంబులు అమర్చినట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా, విమానాశ్రయంలోని ఒక టాయిలెట్ పైపులో మరో పేలుడు పరికరం ఉంచినట్లు బెదిరించాడు.

వివరాలు 

ఘటనపై పోలీసులు కేసు నమోదు

ఈ సమాచారం మేరకు అప్రమత్తమైన అధికారులు వెంటనే బాంబ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించి, విమానాశ్రయం అంతటా గాలింపు నిర్వహించారు. కానీ చివరకు ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దీనిని తప్పుడు హెచ్చరికగా గుర్తించి, నకిలీ బెదిరింపుగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు