
TS Elections : రేపు, ఎల్లుండి విద్యా సంస్థలు సెలవులు.. కలెక్టర్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) కు రంగం సిద్ధమైంది. నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.
పోలింగ్ కారణంగా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.
ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు.
ఎన్నికల పోలింగ్ ముఖ్యంగా ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల్లో నిర్వహిస్తారు.
అందువల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 29, 30 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
Details
పోలింగ్ రోజున వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు సెలవు
డిసెంబర్ ఒకటో తేదీన తిరిగి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి.
మరోవైపు కాలేజీ స్టూడెంట్స్ తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1.06 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు.
ఇక ఈనెల 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు ఉపాధ్యాయులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
పోలింగ్ జరిగే రోజున అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు సెలవు ప్రకటించాల్సి ఉంటుంది.
ఈ సారి ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.