Home ministry office: నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు
దిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో బాంబు పేల్చివేస్తామని బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని పోలీసులు బుధవారం తెలిపారు. వెంటనే బాంబు డిటెక్షన్ స్క్వాడ్, అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్థలానికి తరలించారు. నార్త్ బ్లాక్ పోలీసులకు బెదిరింపు ఇమెయిల్ రావడంతో DFS (ఢిల్లీ ఫైర్ సర్వీస్) రంగంలోకి దిగి బాంబ్ స్క్వాడ్‌ను అక్కడికి పంపినట్లు పోలీసులు PTIకి తెలిపారు. ఇప్పటివరకు మాకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. పాఠశాలలు, విమానాశ్రయాలు, ఆసుపత్రులు, జైళ్లపై బాంబు బెదిరింపులు వచ్చాయి.