LOADING...
Maharashtra: అడవిలో భయానక ఘటన.. నలుగురు చంపిన పులి
అడవిలో భయానక ఘటన.. నలుగురు చంపిన పులి

Maharashtra: అడవిలో భయానక ఘటన.. నలుగురు చంపిన పులి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 22, 2026
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర రాష్ట్రంలో భయానక ఘటన చోటుచేసుకుంది. చంద్రపూర్ జిల్లా జిల్లాలోని గంజేవాహి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం బీడీ ఆకులు ఏరుకునేందుకు వెళ్లిన నలుగురు మహిళలపై పులి ఒక్కసారిగా దాడి చేసి చంపింది. ఈ ఘటనతో సిందేవాహి తాలూకా పరిసర గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో గ్రామీణ ప్రజలు ప్రతిరోజూ ఉదయం పెద్ద సంఖ్యలో అడవికి వెళ్లి ఎండిపోయిన బీడీ ఆకులు సేకరించడం సాధారణమే. ఇదే విధంగా శుక్రవారం ఉదయం కూడా గంజేవాహి ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు అడవిలోకి వెళ్లారు. ఉదయం సుమారు 8 గంటల సమయంలో మాటువేసి ఉన్న పులి అకస్మాత్తుగా వారిపై దాడికి దిగింది.

వివరాలు

అత్యంత భయంకరంగా విరుచుకుపడిన పులి

బాధితులకు తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా పులి అత్యంత భీకరంగా విరుచుకుపడింది. ఈ దాడిలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కవుదుబాయి దాదాజీ మొహర్లే, అనుబాయి దాదాజీ మొహర్లే, సంగీతా సంతోష్ చౌదరీ, సునీతా కౌశిక్ మొహర్లేగా గుర్తించారు. వీరి వయస్సులు 33నుంచి 45ఏళ్ల మధ్య ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్ట్ రేంజ్ అధికారి అంజలీ సాయంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒకేసారి పులి దాడిలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామీణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అడవి ప్రాంతాల సమీప గ్రామాల్లో భయం నెలకొనగా, స్థానికులు వెంటనే చర్యలు తీసుకుని పులిని అదుపులోకి తీసుకురావాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Advertisement