LOADING...
Himachal Pradesh: పెళ్లి ఇంట విషాదం.. రూఫ్‌ కూలి 40 మందికి గాయాలు.. 
పెళ్లి ఇంట విషాదం.. రూఫ్‌ కూలి 40 మందికి గాయాలు..

Himachal Pradesh: పెళ్లి ఇంట విషాదం.. రూఫ్‌ కూలి 40 మందికి గాయాలు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2025
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిమాచల్ ప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. చంబా జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి సందర్బంగా కొంతమంది అతిథులు నృత్యం చేస్తుండగా, ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వివరాలోకి వెళితే.. చంబా జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో వివాహోత్సవం నిర్వహిస్తున్నారు. వేడుకలో భాగంగా కొందరు అతిథులు ఇంటి పైకెక్కి డ్యాన్స్ చేస్తుండగా, మరికొందరు కింద నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలడంతో అక్కడున్న వారంతా కిందపడిపోయారు. ఈ ఘటనలో సుమారు 40 మందివరకు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు.

వివరాలు 

పైకప్పు కూలిపోతోన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్

ప్రమాదం అనంతరం స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని ఎంబులెన్సుల ద్వారా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పైకప్పు కూలిపోతోన్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్

Advertisement