ఉత్తర్‌ప్రదేశ్ జువెనైల్ హోమ్‌లో ఘోరం.. పిల్లలపై సూపరింటెండెంట్ దాష్టికం
జువైనల్ హోమ్‌లోనికి వచ్చే పిల్లలకు రక్షణ కల్పించడంతోపాటు, వాళ్లకు సంస్కారం నేర్పడం అక్కడి సూపరింటెండెంట్ బాధ్యత. కానీ ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలో ఉన్న జువైనల్ హోమ్‌లో అక్కడి సూపరింటెండెంట్ తీరు అందుకు భిన్నంగా ఉంది. జువైనల్ హోమ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను చూస్తే.. మాత్రం అవ్వాకావాల్సిందే. ఆగ్రా జువెనైల్ హోమ్ సూపరింటెండెంట్ అయినా పూనమ్ పాల్ ప్రతిరోజు అక్కడ ఉంటున్న పిల్లల పై దాడులు చేస్తున్నది. అంతేకాకుండా వాళ్లను ఇష్టం వచ్చినట్లుగా కొట్టడం చేస్తుంది. తాజాగా ఓ బాలికనుఆమె చెప్పుతో విచక్షణారహితంగా కొట్టడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డుఅయ్యింది. ఈ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది.
జువైనల్ హోం సూపరింటెండెంట్ సస్పెండ్
ఇలాంటి వీడియోనే మంగళవారం మరో వీడియో బయటపడింది. ఆ వీడియోలో పూనమ్ పాల్ ఒక అమ్మాయి చేతులు,కాళ్ళు కట్టేసి మంచం పక్కనే పడేయించింది. సూపరింటెండెంట్ అఘాయిత్యాలు భరించలేని జువైనల్ హోమ్‌లోని ఓ చిన్నారి కూడా కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసింది. హోం సూపరింటెండెంట్ పూనమ్ పాల్‌ను సస్పెండ్ చేసి ఉన్నతాధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు . ప్రయాగ్‌రాజ్‌లోని జువైనల్ హోమ్‌లో కూడా పాల్ ఇలాంటి సంఘటనలకు పాల్పడింది. ఆగ్రా డివిజన్ కమీషనర్ రీతూ మహేశ్వరి మాట్లాడుతూ,ఈ సంఘటనలతో సంబంధం ఉన్న హోమ్ సూపరింటెండెంట్, పూనమ్ పాల్, ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆమె పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను అదేశించడమే కాకుండా ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు తెలిపారు.