NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Housing Board: హౌసింగ్‌ బోర్డు స్థలాల బహిరంగ వేలం ద్వారా విక్రయం.. మూడు డివిజన్ల పరిధిలోని 73 ప్లాట్లు 
    తదుపరి వార్తా కథనం
    Housing Board: హౌసింగ్‌ బోర్డు స్థలాల బహిరంగ వేలం ద్వారా విక్రయం.. మూడు డివిజన్ల పరిధిలోని 73 ప్లాట్లు 
    హౌసింగ్‌ బోర్డు స్థలాల బహిరంగ వేలం ద్వారా విక్రయం

    Housing Board: హౌసింగ్‌ బోర్డు స్థలాల బహిరంగ వేలం ద్వారా విక్రయం.. మూడు డివిజన్ల పరిధిలోని 73 ప్లాట్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 16, 2025
    09:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్రేటర్ పరిధిలో కొన్నేళ్లుగా అక్కడక్కడా మిగిలిపోయిన హౌసింగ్ బోర్డు స్థలాలను తాజాగా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని అధికారులు నిర్ణయించారు.

    మూడు డివిజన్ల పరిధిలోని 73 ప్లాట్లను విక్రయానికి ఉంచారు, వీటి మొత్తం విస్తీర్ణం 4,880.98 చదరపు గజాలు.

    ఈ స్థలాలలో అత్యల్పం 6.11 చదరపు గజాలు, అత్యధికం 290 చదరపు గజాలు ఉన్నాయి.

    వంద చదరపు గజాలు లేదా అంతకుమించి ఉన్న స్థలాలు కేవలం 15 మాత్రమే ఉన్నాయి.

    ఇవి కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని నాలుగు ఫేజుల్లో ఉన్నాయని పేర్కొన్నారు.

    వివరాలు 

    అసంపూర్ణ బహుళ అంతస్తులు వేలం

    గతంలో కొన్ని చిన్న ప్లాట్లు, అలాగే కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాని స్థలాలు మిగిలిపోయాయి.

    ఇప్పుడు అవి గుర్తించి, తాజగా విక్రయానికి పెట్టారు. వీటి విక్రయం ద్వారా రూ.60 కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

    ఈ నెలలో రెండు దఫాలుగా 31 ప్లాట్లను, వచ్చే నెల ఐదో తేదీన మిగిలిన 42 స్థలాలను వేలం వేయాలని నిర్ణయించారు.

    మార్చి నెలలో మరింతగా ఖాళీగా ఉన్న ప్లాట్లు, ఫ్లాట్లు, అసంపూర్ణ బహుళ అంతస్తులు వేలం వేయాలని యోచిస్తున్నారు.

    ఆ సమయంలో సుమారు రెండు వేలకు పైగా స్థలాలు వేలం పరిధిలోకి తీసుకురావాలని ఉన్నతాధికారి ఒకరు వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్
    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రేరణ
    Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ కమల్ హాసన్

    హైదరాబాద్

    Hyderabad: హైదరాబాద్‌లో మరిన్ని స్కైవాక్‌లకు జీహెచ్‌ఎంసీ నిర్ణయం.. త్వరలో ట్రిపుల్‌ఐటీ, విప్రో కూడళ్లలో నిర్మాణం  భారతదేశం
    Telangana: హైదరాబాద్‌'కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము .. ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్‌ సమీక్ష ద్రౌపది ముర్ము
    Book fair : హైదరాబాద్ బుక్‌ ఫెయిర్‌.. ఈ నెల 19 నుంచి పుస్తకాల పండుగ  రేవంత్ రెడ్డి
    Mohan Babu: మోహన్‌బాబుకు చికిత్స పూర్తి.. గచ్చిబౌలిలోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025