
AP Sankranthi Holidays 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో అత్యంత వైభవంగా జరుపుకొనే పండుగల్లో సంక్రాంతి(Sankranti) మొదటి స్థానంలో ఉంటుంది.
ఈ వచ్చే ఏడాది 2024లో సంక్రాంతి పండగకు ఏపీ ప్రభుత్వం (AP Govt) స్కూల్స్, కాలేజీలకు భారీగానే సెలవులు ఇచ్చారు.
ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు నాలుగు నుంచి ఆరు రోజుల పాటు వచ్చే అవకాశముంది.
జనవరిలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం జనవరి 13వ తేదీని రెండో శనివారం, జనవరి 14న బోగి పండుగ, 15న సంక్రాంతి పండుగ సాధారణంగా సెలవు ఉంటుంది.
అలాగే జనవరి 16న ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. దీంతో స్కూల్స్, కాలేజీలకు మరో రెండు రోజుల పాటు అదనంగా సెలవులు రానున్నాయి.
Details
2024 ఏడాదిలో వచ్చే సెలవులు ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో 2024లో సెలవులు వివరాలు ఇవే..
☛ 15-01-2024న (సోమవారం) సంక్రాంతి
☛ 16-01-2024న (మంగళవారం) కనుమ
☛ 26-01-2024 (శుక్రవారం)రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం)మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం)హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం)గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం)ఉగాది
☛ 11-04-2024 (గురువారం)ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం)శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం)బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం)మొహర్రం
☛ 15-08-2024 (గురువారం)స్వాతంత్య్ర దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం)శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం)వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం)ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం)గాంధీజయంతి
☛ 11-10-2024 (శుక్రవారం)దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం)దీపావళి
☛ 25-12-2024 (బుధవారం)క్రిస్మస్