
Waqf Land: వక్ఫ్ మొత్తం సంపద ఎంత.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఆస్తులున్నాయి..?
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు -2025 అధికార, విపక్షాల మధ్య తీవ్రమైన వాగ్వాదాలకు కారణమైంది.
ఈ బిల్లు పార్లమెంట్, రాజ్యసభల్లో ఆమోదం పొందింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది.
రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత, ఈ బిల్లు చట్టంగా అమలులోకి రానుంది.
కొత్త బిల్లులోని ముఖ్యమైన మార్పుల ప్రకారం, వరుసగా ఐదేళ్లు ఇస్లాంను ఆచరించిన వ్యక్తులు మాత్రమే తమ యాజమాన్యంలోని ఆస్తిని వక్ఫ్‌కి దానం చేయగలరు.
అలాగే, వక్ఫ్ ఆస్తుల సర్వే నిర్వహించే అధికారం వక్ఫ్ కమిషనర్ వద్ద నుంచి కలెక్టర్‌కు బదిలీ చేయబడింది.
వివరాలు
దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న ఆస్తుల వివరాలు
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, వక్ఫ్ బోర్డు పరిధిలో 8,72,328 స్థిరాస్తులు, 16,713 చరాస్తులు నమోదు అయ్యాయి.
అదనంగా, 3,56,051 వక్ఫ్ ఎస్టేట్‌లు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 9.4 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంది.
ఈ ఆస్తుల విలువ సుమారుగా రూ.1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.
భారతదేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖల తర్వాత అత్యధిక భూమిని కలిగి ఉన్న విభాగంగా వక్ఫ్ బోర్డు నిలిచింది.
రక్షణ మంత్రిత్వ శాఖ వద్ద 17.95 లక్షల ఎకరాలు ఉండగా, రైల్వే శాఖ వద్ద 12 లక్షల ఎకరాల భూమి ఉంది.
వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డు ఆస్తుల సంఖ్య
మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం: ఉత్తరప్రదేశ్ - 2,32,547 వక్ఫ్ ఆస్తులు, పశ్చిమ బెంగాల్ - 80,480, గుజరాత్ - 39,940, బీహార్ - 8,616, తెలంగాణ - 45,682, ఆంధ్రప్రదేశ్ - 14,685, తమిళనాడు - 66,095, మహారాష్ట్ర - 36,701.
ఇలా, మిగిలిన రాష్ట్రాల్లో కూడా వక్ఫ్ బోర్డు పరిధిలో అనేక ఆస్తులు ఉన్నట్లు మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికలో పేర్కొంది.