Page Loader
Congress: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం 'ఇండియా'లో కూటమిలో సీట్ల పంపకంపై ఉంటుందా?
Congress: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం 'ఇండియా'లో కూటమిలో సీట్ల పంపకంపై ఉంటుందా?

Congress: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం 'ఇండియా'లో కూటమిలో సీట్ల పంపకంపై ఉంటుందా?

వ్రాసిన వారు Stalin
Dec 04, 2023
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని కోల్పోయిన హస్తం పార్టీ, మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో విఫలమైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల 'ఇండియా' కూటమికి నాయకత్వం వహించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఈ మూడు రాష్ట్రాల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. అంతేకాకుండా, ఈ ఫలితాల ప్రభావం ఇండియా కూటమిపై తీవ్రంగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి దక్షిణాదిపై పూర్తిస్థాయి ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్.. ఉత్తరాదిలో మాత్రం చతికిలబడిపోయింది.

కాంగ్రెస్

దేశంలో మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో కాంగ్రెస్

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇండియా కూటమి మధ్య సీట్ల పంపకాల వ్యవహారంలో ఉత్తర భారతంలో ఈ మూడు రాష్ట్రాల ఫలితాలు కీలకంగా మారే అవకాశం ఉంది. సీట్ల పంపకాల సమయంలో కాంగ్రెస్ ఆశించిన సీట్లను ఇవ్వకుండా, భాగస్వామ్య పక్షాలు ఒత్తి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లో ఓటమి కారణంగా కాంగ్రెస్ డిమాండ్ చేసే పరిస్థితి ఉండదని, బేరసారాలకు కూడా అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు దేశంలో సొంతంగా మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. వాటిలో రెండు దక్షిణాదిలోని తెలంగాణ, కర్ణాటకలో ఉన్నాయి. ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉంది. బీహార్, జార్ఖండ్‌లో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.