Page Loader
Narayana: ఏపీ రాజధాని అమరావతికి మరో శుభవార్త.. రూ.11వేల కోట్ల రుణానికి హడ్కో గ్రీన్ సిగ్నల్
ఏపీ రాజధాని అమరావతికి మరో శుభవార్త.

Narayana: ఏపీ రాజధాని అమరావతికి మరో శుభవార్త.. రూ.11వేల కోట్ల రుణానికి హడ్కో గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2024
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కీలకమైన అడుగులు పడుతున్నాయి. సీఆర్డీఏ (అంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ)కు రూ. 11,000 కోట్ల రుణం మంజూరు చేసేందుకు ఆమోదం లభించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి నారాయణ, ఢిల్లీలో హౌసింగ్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) సీఎండీని కలుసుకున్నారు. అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వ ఉద్దేశాలను వివరించగా, హడ్కో ఛైర్మన్‌, సీఎండీ సంజయ్‌ కుల్‌ శ్రేష్ఠ రూ. 11 వేల కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకారం తెలిపినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.

వివరాలు 

హడ్కో మరో రూ. 165 కోట్ల రుణం విడుదల 

అదనంగా, హడ్కో మరో రూ. 165 కోట్ల రుణం విడుదల చేసేందుకు కూడా అంగీకరించిందని నారాయణ పేర్కొన్నారు. ఈ నిధులను నెల్లూరు నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం వినియోగిస్తామని, గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఉద్దేశమని తెలిపారు. అమరావతి నిర్మాణ మొదటి దశకు ప్రభుత్వం రూ. 26 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు రూ. 15 వేల కోట్ల రుణం అందించేందుకు ఇప్పటికే అంగీకరించాయి. తాజాగా హడ్కో రుణంతో కలిపి మొత్తంగా రూ. 26 వేల కోట్ల నిధులు సమకూరుతున్నాయి.

వివరాలు 

మొదటి దశ పనుల పూర్తికి  రూ. 26 వేల కోట్లు ఖర్చు 

ప్రభుత్వ భవనాల నిర్మాణం, ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు తిరిగి ఇచ్చే ప్లాట్ల అభివృద్ధి, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు, ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి పనులకు మొత్తం రూ. 50 వేల కోట్లు అవసరమని అంచనా వేయబడింది. మొదటి దశ పనుల పూర్తి చేయడంలో రూ. 26 వేల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.