తదుపరి వార్తా కథనం
Amaravati: రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 22, 2025
03:12 pm
ఈ వార్తాకథనం ఏంటి
రాజధాని అమరావతి నిర్మాణానికి ₹11,000 కోట్లను విడుదల చేయడానికి హడ్కో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు.
ముంబయిలో జరిగిన సమావేశంలో ఈ నిధుల విడుదలకు హడ్కో బోర్డు అనుమతి ఇచ్చిందని మంత్రి తెలిపారు.
అమరావతి నిర్మాణానికి హడ్కో ద్వారా ₹11,000 కోట్ల రుణం పొందేందుకు చర్చలు జరిపినట్టు ఆయన వివరించారు.
నిధుల విడుదలకు హడ్కో నిర్ణయం తీసుకోవడంతో రాజధాని నిర్మాణ పనులు వేగవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.