CM Chandrababu Naidu : 2024 బడ్జెట్‌లో ఏపీకి భారీ కేటాయింపులు.. చంద్రబాబు ఏం చెప్పారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించారు. వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం గొప్ప పరిణామంగా అభివర్ణించారు.
ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. పేదలు, మహిళలు, రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం సంకల్పాన్ని ప్రశంసించారు.
రాబోయే ఐదేళ్లలో వృద్ధి కోసం బడ్జెట్ 6 కీలక రంగాలను గుర్తించిందని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కేంద్రం 2024 డిసెంబర్ 24 వరకు ఏపీకి రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది.
Details
బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులివే
పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు
ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు రూ.12,157 కోట్లు
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు
విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు
ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి: రూ.162 కోట్లు
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు: రూ.186 కోట్లు
Details
ఏపీ మరో 7 ఎయిర్ పోర్టులు
ఏపీ ప్రజల తరపున కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపినట్లు వివరించారు. వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ నిధుల దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.
2028 వరకు జల్ జీవన్ పథకం పొడిగింపు ద్వారా ఏపీకి ఎంతో ఉపయోగం కలుగుతుందని చెప్పారు. రాష్ట్రానికి సముచిత న్యాయం చేయడంలో టీమ్ వర్క్ చేస్తామన్నారు.
అదనంగా ఏపీకి మరో 7 ఎయిర్‌పోర్టులు రానున్నట్లు తెలిపారు.