
explosives seized : ఆంధ్రా కర్ణాటక సరిహద్దులో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఓ కారులో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు ఘటన తర్వాత పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపడుతున్నారు.
కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులోని కోలార్ జిల్లాలోని నంగాలీ చెక్పోస్ట్ వద్ద పోలీసులు ఓ కారును ఆపి చెక్ చేయగా పేలుడు పదార్థాలు బయటపడ్డాయి.
1200 జిలెటిన్ స్టిక్స్, 7 డిటోనేటర్ వైరు బాక్సులు, 6 డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఒకరిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. అతడిని హజ్రత్ అలీగా గుర్తించారు.
రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనకు ఇతడికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
Massive quantity of explosives seized from Nangali checkpost at Karnataka-Andhra Pradesh border; one accused arrested, one absconding.
— Social News Daily (@SocialNewsDail2) April 8, 2024
Further details awaited pic.twitter.com/JgUUskT4dH