
Haryana: హర్యానాలో భారీ పేలుడు కలకలం.. నలుగురు కుటుంబ సభ్యులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా రాష్ట్రం బహదూర్‌గఢ్‌లో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
మొదట గ్యాస్ సిలిండర్ పేలుడు అని భావించారు. అయితే ఇది బెడ్‌రూమ్‌లోనే పేలుడు జరిగిందని డీసీపీ మయాంక్ మిశ్రా మాట్లాడారు.
ఇంట్లోని ఏసీ యూనిట్ పూర్తిగా దెబ్బతినడం వల్లే పేలుడు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫోరెన్సిక్ బృందాలు పేలుడు విశ్లేషణ నిపుణులను ఘటనాస్థలానికి రప్పించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Details
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పేలుడు తీవ్రతకు మొత్తం ఇంటి గోడలు దెబ్బతిన్నాయి. 10 సంవత్సరాల పిల్లలు ఇద్దరు, ఒక మహిళ, ఒక పురుషుడు ఈ పేలుడు వల్ల ప్రాణాలు కోల్పోయారు.
గాయపడిన హరిపాల్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుతో ఇంట్లో మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి నాలుగు మృతదేహాలను వెలికితీశారు.
పేలుడుకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్ కండిషనర్ కంప్రెసర్‌లోపం కారణంగా పేలుడు జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.