Page Loader
Massive Fire: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం
వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

Massive Fire: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 30, 2024
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దాదాపు 200 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాహనాల పార్కింగ్ ప్రాంతంలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారమందించారు. సమాచారం అందుకున్న వెంటనే 12 ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రక్రియ ప్రారంభించాయి. జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసుల సాయంతో అగ్నిమాపక సిబ్బంది దాదాపు 2 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు

Details

 షార్ట్ సర్క్యూట్‌ వల్లనే  అగ్ని ప్రమాదం

షార్ట్ సర్క్యూట్‌ వల్లనే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. దగ్ధమైన ద్విచక్ర వాహనాల్లో చాలా వరకూ రైల్వే ఉద్యోగులవేనని అధికారులు గుర్తించారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన అనంతరం రైల్వే అధికారులు, పోలీసు శాఖ సమన్వయం చేసుకుని భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు నివారించేందుకు అదనపు భద్రతా చర్యలను చేపట్టాలని నిర్ణయించారు.