
Huge library: హైటెక్ సిటీలో భారీ లైబ్రరీ ప్రారంభం.. ప్రతి ఒక్కరికీ ఉచిత ప్రవేశం
ఈ వార్తాకథనం ఏంటి
హైటెక్ సిటీలోని ప్రణవ్ బిజినెస్ పార్క్ భవనంలో ఒక భారీ పబ్లిక్ లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది. కోఫోర్జ్ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాల్లో భాగంగా 15,660 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ లైబ్రరీని ఏర్పాటు చేసింది. వయసు, విద్యా స్థాయి, ఆర్థిక నేపథ్యాన్ని పరిమితం చేయకుండా పుస్తక పఠనంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తోంది. లైబ్రరీ 8వ అంతస్తులో ఉంది.
Details
అందుబాటులో 15వేల పుస్తకాలు
ఒకేసారి 160 మంది పాఠకులు కూర్చుని చదువుకోవచ్చు. లైబ్రరీ ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరవబడుతుంది. ఇక్కడ ఫిక్షన్, నాన్-ఫిక్షన్, పిల్లల సాహిత్యం, వ్యాపారం, చరిత్ర, ఆత్మకథలు, క్రీడలు, ఏఐ, ఆధునిక టెక్నాలజీ పుస్తకాలు, ఆధ్యాత్మిక, రాజకీయం, మార్కెటింగ్, మేనేజ్‌మెంట్, భాష, సినిమా, ట్రావెలాగ్ వంటి విభాగాల పుస్తకాలు ఉన్నాయి. మొత్తం తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో 15,000 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల పఠనాసక్తిని పెంపొందించే కిడ్స్ జోన్, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఈ విజ్ఞాన భాండాగారం మంగళవారం ప్రారంభించారు.