రెండు రోజుల పాటు ముంబైలో కుంభవృష్టి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
ముంబై సహా మహారాష్ట్ర తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురవనున్నాయి. రాగల 2 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్జ్ ను సైతం జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. దీంతో పాటు ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, గోవా, హిమాచల్, ఉత్తరాఖండ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. భారీ వర్షాల వల్ల రోడ్డు రవాణా, విమానాల రాకపోకలకు అంతరాయం, ఆస్తిప్రాణ నష్టం సంభవించే నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేస్తారు.
పలు ప్రాంతాల్లో ఆరెండ్ అలెర్ట్ జారీ : ఐఎండీ
మరోవైపు కుంభవృష్టి వానాలతో ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రుద్ర ప్రయాగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఓ వ్యక్తి చనిపోయాడు. మరో ఘటనలో ఉత్తర కాశీ జిల్లా పురోలా తహసీల్ లోని కంద్యాల్ గ్రామంలో పొలంలో నాట్లు వేస్తుండగా అభిషేక్ అనే యువకుడు మరణించాడు. ఇందులో భాగంగానే మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఐఎండీ ప్రకారం కలర్ల ప్రకారం వాటి తీవ్రత : ఆకుపచ్చ : ఎలాంటి చర్యలు అవసరం లేదు పసుపు : సిద్ధంగా ఉండాలని నారింజ : సంసిద్ధులై మెలగాలని ఎరుపు : వెంటనే చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం.