రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
జూన్ 8న కేరళను తాకిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం తెలిపింది. వచ్చే 5 రోజుల పాటు కేరళలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్ 9 నుంచి 11 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య-తూర్పు అరేబియా సముద్రం మీదుగా ఉన్న సూపర్ సైక్లోన్ బిపార్జోయ్ తుఫాను రానున్న 36 గంటల్లో బలపడనుంది. ఈ క్రమంలో ముందుగా ఈశాన్య దిశలో, తరువాతి మూడు రోజుల్లో వాయువ్య దిశలో తుపాను కదిలే అవకాశం ఉంది.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు: ఐఎండీ
రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో 24 గంటల్లో 64.5 మి.మీ నుంచి 115.5 మి.మీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఫలితంగా రానున్న ఐదు రోజుల్లో బిపార్జోయ్ తుపాను కారణంగా కేరళలోని 8 జిల్లాల్లో భారీ వర్షాలు ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది కేరళలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాబోయే ఐదు రోజులు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.