తెలంగాణలో వచ్చే 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. సగటు వర్షపాతాన్ని దాటేసినట్లు ఐఎండీ వెల్లడి
తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. ఈ కారణంగానే పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వానలు పడనున్నట్లు వాతావరణ విభాగం సూచించింది.ఖమ్మం, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనుంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 603.2 మి.మీగా పేర్కొన్న వాతావరణ కేంద్రం, 723.1 మి.మీ వర్షపాతం కురిసినట్లు ప్రకటించింది.