Page Loader
తెలంగాణలో భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు సెలవు 
తెలంగాణలో భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో కుంభవృష్టి.. విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణలో భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు సెలవు 

వ్రాసిన వారు Stalin
Sep 05, 2023
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మంగళవారం ఉదయం మూడు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ స్తంభించిపోయింది. ఆ మూడు గంటల్లోనే చాలా ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం నమోదైందని ఐఎండీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఈ భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

ఐఎండీ

హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు

హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారని మేడ్చల్ డీఈవో తెలిపారు. అయితే ఉపాధ్యాయ దినోత్సవ అవార్డు కార్యక్రమం ఈరోజు కొనసాగుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే, తెలంగాణతో పాటు కేరళ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.