LOADING...
Telangana: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టులో భారీ ఊరట
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టులో భారీ ఊరట

Telangana: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టులో భారీ ఊరట

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను కోర్టు కొట్టివేసింది. 2011లో ట్యాంక్ బండ్‌పై నిర్వహించిన మిలియన్ మార్చ్ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తులో భాగంగా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావును నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, ముగ్గురిపై నమోదైన కేసులను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

Advertisement