Loading...
Sonia Gandhi: అవాస్తవాలకు తెరదించేందుకే ఆత్మకథ.. 'బిలాంగింగ్' పేరు వెనుక కారణం చెప్పిన సోనియా గాంధీ
Sonia Gandhi: అవాస్తవాలకు తెరదించేందుకే ఆత్మకథ..

Sonia Gandhi: అవాస్తవాలకు తెరదించేందుకే ఆత్మకథ.. 'బిలాంగింగ్' పేరు వెనుక కారణం చెప్పిన సోనియా గాంధీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

కుటుంబం గురించి ప్రచారంలో ఉన్న అవాస్తవాలను సరిదిద్ది, అసలు విషయాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే తన ఆత్మకథను రాసినట్లు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వెల్లడించారు. దిల్లీలో నిర్వహించిన తన పుస్తకం 'బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey Of Love) అధికారిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తన జీవితంలోని అనుభవాలు, కుటుంబంతో ఉన్న అనుబంధం, ఎదుర్కొన్న కష్టాలను ఈ పుస్తకంలో వివరించినట్లు తెలిపారు. ముఖ్యంగా అత్త ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీల హత్యలకు సంబంధించిన విషయాలను రాయడం తనకు ఎంతో కష్టంగా అనిపించిందని చెప్పారు. రాజీవ్ గాంధీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయనతో సాగిన ప్రేమ ప్రయాణం అద్భుతమైనదని భావోద్వేగానికి గురయ్యారు.

వివరాలు 

కుటుంబం గురించి ఎన్నో అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి

తన జీవిత కథను తానే రాయాలని స్నేహితులు చాలాసార్లు సూచించారని సోనియా గాంధీ తెలిపారు.

అయితే, తన వ్యక్తిగత భావాలను, జీవితంలోని అనుభవాలను బహిరంగంగా వెల్లడించేందుకు మొదట్లో వెనుకాడినట్లు చెప్పారు.

చివరకు కుమారుడు రాహుల్ గాంధీ,కుమార్తె ప్రియాంక గాంధీ,రచయిత్రి మంజులికా దుబే పట్టుబట్టడంతో పుస్తకం రాయడానికి అంగీకరించినట్లు వివరించారు.

మొదట్లో రచన ప్రారంభించడం కష్టంగా అనిపించినప్పటికీ, ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత తన ఆలోచనలు,భావాలు నిరంతరంగా సాగాయని పేర్కొన్నారు.

తన కుటుంబం గురించి బయట ప్రచారంలో ఉన్న అనేక విషయాలు అవాస్తవాలతో కూడుకున్నవని,వాటిలో కొన్ని ఎంతో బాధ కలిగించాయని సోనియా అన్నారు.

ఈ నేపథ్యంలో తన కుటుంబం గురించి వాస్తవాలను,వ్యక్తిగత అనుభవాలను ప్రజలతో పంచుకోవడానికి ఈ పుస్తకం ఒక మంచి అవకాశంగా భావించినట్లు తెలిపారు.

వివరాలు 

కొత్త వాతావరణంలో కలిసిపోవడమే 'బిలాంగింగ్'

తాను ఎప్పుడూ డైరీ రాసే అలవాటు చేసుకోలేదని, అందువల్ల పుస్తకంలోని చాలా విషయాలను తన జ్ఞాపకాల ఆధారంగానే రాసినట్లు వెల్లడించారు.

తన పుస్తకానికి 'బిలాంగింగ్' అనే పేరు పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని కూడా సోనియా గాంధీ వివరించారు.

ఒక కొత్త దేశం, కొత్త సంస్కృతి, కొత్త కుటుంబ వాతావరణంలో తాను ఎలా మమేకమయ్యేందుకు ప్రయత్నించానో ఈ పేరు తెలియజేస్తుందని చెప్పారు.

ఇందిరా గాంధీ కోడలిగా భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడి జీవన విధానం, వాతావరణం తన ఇటాలియన్ నేపథ్యానికి పూర్తిగా భిన్నంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు.

అయితే, ఇటలీలో పెరిగిన సమయంలో పెద్దలను గౌరవించాలని తనకు నేర్పిన విలువలు భారతీయ కుటుంబంలో కలిసిపోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

రాజకీయాల్లోకి రావడాన్ని వ్యతిరేకించా..

మొదట్లో ఇందిరా గాంధీ అంటే తనకు చాలా భయంగా ఉండేదని, ఆమెను 'మమ్మీ' అని పిలవడానికి కూడా చాలా సమయం పట్టిందని ఆనాటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు.

తన భర్త రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడాన్ని మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించినట్లు సోనియా వెల్లడించారు.

ఆయన రాజకీయాల్లోకి వస్తే కుటుంబంతో గడిపే కొద్దిపాటి సమయం కూడా తగ్గిపోతుందని ఆందోళన చెందానని చెప్పారు.

అయితే, ఆ తర్వాత తమ జీవితం పూర్తిగా మారిపోయిందని, ఈ పరిణామాల మధ్య తమ ఇద్దరి అనుబంధం మరింత బలపడిందని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

రాజకీయాల్లోకి రావడాన్ని వ్యతిరేకించా..

రాజీవ్ గాంధీ మరణం తన జీవితంలో పెను విషాదాన్ని మిగిల్చిందని సోనియా భావోద్వేగంగా చెప్పారు.

ఆయన మరణం తర్వాత తాను ఒక బిడ్డలా మారిపోయానని, ఆ సమయంలో తన పిల్లలు రాహుల్, ప్రియాంక తనను తల్లిదండ్రుల్లా చూసుకున్నారని గుర్తుచేసుకున్నారు.

ప్రస్తుతం తన పుస్తకానికి పాఠకుల నుంచి లభిస్తున్న ఆదరణ, ప్రేమ తనను ఎంతో భావోద్వేగానికి గురిచేస్తున్నాయని సోనియా గాంధీ తెలిపారు.

ADVERTISEMENT