Hyderabad: మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ సచివాలయంలోని మింట్ కాంపౌండ్‌లో గల టెక్ట్స్ బుక్ ప్రింటింగ్ ప్రెస్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువచేసే పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి.
తొలుత అగ్నిప్రమాదంపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు అధికారులు తెలిపారు.
నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే సమగ్ర పరిశీలన తర్వాత ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అగ్నిప్రమాద దృశ్యాలు
మింట్ కాంపౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం..
— BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2024
ఎగిసిపడుతున్న మంటలు ఘటన స్థలానికి చేరుకున్న ఐదు ఫైర్ ఇంజన్స్..
మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది..#Mintcompound #fireincident #Mintcompoundfireincident #Fireengines #NewsUpdate #bigtvlive pic.twitter.com/ZOcDbjjvr4