Page Loader
శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేసిన అలయన్స్ ఎయిర్ 
హైదరాబాద్‌: శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేసిన అలయన్స్ ఎయిర్

శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేసిన అలయన్స్ ఎయిర్ 

వ్రాసిన వారు Stalin
Apr 10, 2023
07:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ నుంచి బయలు దేరే అలయన్స్ ఎయిర్‌కు చెందిన ఎనిమిది విమానాలను రద్దు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. రద్దు చేసిన విమానాల్లో హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, విజయవాడ, మైసూర్, చెన్నై వెళ్లే విమానాలు ఉన్నాయి. సాంకేతిక లేదా కార్యాచరణ కారణాల వల్ల వాటిని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో విమానాలను ఎలా రద్దు చేస్తారని ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన యాజమాన్యం ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. టికెట్ డబ్బులను రీఫండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై చింతిస్తూ యాజమాన్యం ట్వీట్