Loading...
Telangana: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ పాస్‌ ధరలు భారీగా తగ్గింపు

Telangana: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ పాస్‌ ధరలు భారీగా తగ్గింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు దీపావళి కానుకగా మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్‌ ధరలను భారీగా తగ్గించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. ప్రస్తుతం రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్‌ ధరను రూ.4,000కు తగ్గించినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా 'ఎక్స్‌'లో వివరాలు వెల్లడించారు. ప్రయాణికులపై రవాణా ఖర్చుల భారాన్ని తగ్గించి, ప్రజా రవాణా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

వివరాలు 

ఉమ్మడి ప్రయాణ పాస్‌ ధర రూ.4,000

ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజువారీ మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్‌ ధరను రూ.275కు తగ్గించినట్లు మంత్రి తెలిపారు.

ఇందులో మెట్రో ప్రయాణానికి రూ.200, ఆర్టీసీ ప్రయాణానికి రూ.75 కేటాయించారు. ఈ పాస్‌తో రోజుకు గరిష్ఠంగా నాలుగు సింగిల్ జర్నీలు చేసుకునే అవకాశం ఉంటుంది.

అలాగే ఇప్పటివరకు రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్‌ ధరను రూ.4,000కు తగ్గించారు.

ఇందులో మెట్రో ప్రయాణానికి రూ.3,000, ఆర్టీసీ ప్రయాణానికి రూ.1,000 కేటాయించారు. ఈ పాస్‌తో నెలలో గరిష్ఠంగా 50 రౌండ్ ట్రిప్పులు ప్రయాణించవచ్చు.

వివరాలు 

నవంబర్ 8 నుంచి అమల్లోకి

ధరల తగ్గింపుతో నెలవారీ ఉమ్మడి పాస్‌ వినియోగదారులకు రూ.4,500 ఆదా అవుతుంది.

రోజువారీ పాస్‌ తీసుకునే ప్రయాణికులకు రూ.125 వరకు ఖర్చు తగ్గుతుంది.

ప్రభుత్వం ప్రకటించిన కొత్త ధరలు నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత సంస్థలను ఆదేశించినట్లు పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు.

ప్రజల సంక్షేమం, ప్రయాణికుల ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు ఎంతో ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT