
MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి అందరికీ తెలిసిందే.
అయితే, ఈ ఎన్నికలు ముగిసి నెల కూడా పూర్తి కాకముందే మరోసారి రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది.
తాజాగా, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు.
ఈ మేరకు, మార్చి 28న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
అలాగే, ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
వివరాలు
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ లో కొమురయ్య విజయం
మే 1వ తేదీతో ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్థానానికి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఇదివరకే జరిగిన తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు.
అలాగే, కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో కొమురయ్య విజయం సాధించారు.
మరోవైపు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజయ్య గెలిచారు.