హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయండి.. రాహుల్ గాంధీకి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సవాల్
హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచే బరిలోకి దిగాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోందని రాహుల్ చెప్పిన కొద్దిసేపటికే ఒవైసీ ఈ సవాలు చేశారు. 1992లో కాంగ్రెస్ హయాంలోనే బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందని గుర్తు చేశారు. ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి దూషణలపైనా మాట్లాడిన అసద్, పార్లమెంటులో ముస్లింలపై హత్యలు జరిగే రోజులు ఎంతో దూరంలో లేదన్నారు. దీనిపై ప్రధాని మోదీ ఒక్క మాట మాట్లాడరని, మీ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు.