Page Loader
హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు
హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు

వ్రాసిన వారు Stalin
Apr 08, 2023
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలపై భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ కీలక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో అప్పుడప్పుడు వర్షాలు పుడుతున్నా, ఎండలు మాత్రం మరింత పెరిగే అవకాశం ఉదని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా పగటి పూట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాబోయే రోజుల్లో వేసవి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వేడి, ఉక్కపోత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ వెల్లడించింది.

ఎండలు

రాత్రి ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల వరకు పెరుగుతాయి: వాతావరణ శాఖ

ఎండలు భారీగా మండుతున్న నేపథ్యంలో పగటి పూట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని, దీంతో ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 23 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతాయని తెలిపింది. నిర్మల్, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాలతో సహా కొన్ని జిల్లాల్లో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.