తదుపరి వార్తా కథనం

Hyderabad: అమెరికాలో దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 04, 2025
04:47 pm
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో జరిగిన ఓ దుండగుడి కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి చనిపోయిన విషాదం చోటు చేసుకుంది. బీఎన్ రెడ్డి నగర్‌లోని (Elbinagar) ప్రాంతానికి చెందిన పోలే చంద్రశేఖర్ 2023లో బీడీఎస్ డిగ్రీ పూర్తి చేసి, మరింత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఈ ఉదయాన్నే డాలస్‌లో జరిగిన కాల్పుల్లో అతను మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. తల్లిదండ్రులు తమ కొడుకు ఇక లేరని తెలిసి తీవ్ర ఆవేదనలో పడిపోయారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, తమ మద్దతును ప్రకటించారు.