 
                                                                                Telangana: తెలంగాణ సర్కార్ కీలక నియామకాలు.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు క్యాబినెట్ హోదాతో పదవులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కోసం ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం కేబినెట్ స్థాయి హోదాతో కీలక పదవులు కల్పించింది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమితులయ్యారు. మరోవైపు బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ, కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరు కావడానికి అవకాశం ఇచ్చింది. ఈ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, సుదర్శన్ రెడ్డికి మంత్రులకు లభించే అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌కు కేబినెట్ హోదా
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారిని తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ గా క్యాబినెట్ హోదాలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది #TelanganaCivilSupplies #KokkiralaPremSagarRao #Telangana pic.twitter.com/AdBlyfqdnn
— CPRO to CM / Telangana (@CPRO_TGCM) October 31, 2025