LOADING...
Hyderabad vs Bengaluru Traffic: హైదరాబాద్ రహదారులపై బెంగళూరు టెక్కీ ఆశ్చర్యం.. నెట్టింట ట్రాఫిక్ చర్చ
హైదరాబాద్ రహదారులపై బెంగళూరు టెక్కీ ఆశ్చర్యం.. నెట్టింట ట్రాఫిక్ చర్చ

Hyderabad vs Bengaluru Traffic: హైదరాబాద్ రహదారులపై బెంగళూరు టెక్కీ ఆశ్చర్యం.. నెట్టింట ట్రాఫిక్ చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య పోలిక కొత్త విషయం కాదు. సమాచార సాంకేతిక రంగం, జీవన విధానం, వాతావరణం,నగర అభివృద్ధి వంటి అనేక అంశాల్లో ఈ రెండు మహానగరాలు ఎప్పుడూ చర్చలో ఉంటాయి. తాజాగా ట్రాఫిక్ వ్యవస్థ, రహదారి సదుపాయాల విషయంలో మరోసారి ఈ రెండు నగరాల పేర్లు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్‌లో తన ప్రయాణ అనుభవాన్ని పంచుకున్న ఓ బెంగళూరు వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విస్తృత చర్చకు దారితీశాయి. ఆర్చీ సేన్‌గుప్తా అనే వ్యక్తి 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ హైదరాబాద్ రోడ్ల పరిస్థితిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నానని పేర్కొన్న ఆయన.. 12 కిలోమీటర్ల దూరాన్ని కేవలం అరగంటలో పూర్తి చేశానని తెలిపారు.

వివరాలు 

టెక్కీ పోస్టుకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున స్పందనలు

బెంగళూరులో అయితే అదే సమయంలో ఒక కిలోమీటరు కూడా ప్రయాణించడం కష్టమని వ్యాఖ్యానించారు. ఇక్కడి రహదారి సదుపాయాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున స్పందనలు వచ్చాయి. వేల సంఖ్యలో వీక్షణలు, వందలాది కామెంట్లతో ఈ చర్చ మరింత వేడెక్కింది. హైదరాబాద్‌కు చెందిన కొందరు వినియోగదారులు నగర రహదారులపై ప్రశంసలు కురిపించారు. కార్యాలయం నుంచి బయలుదేరిన తర్వాత 50 కిలోమీటర్ల దూరాన్ని గంటలోపే చేరుకుంటున్నామని కొందరు వెల్లడించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ప్రయాణ సమయం చాలా సౌకర్యంగా మారిందని మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు.

వివరాలు 

బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితులపై అసంతృప్తి

ఇంకొందరు మాత్రం బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ 5 కిలోమీటర్ల ప్రయాణమే చాలా పెద్దదిగా అనిపించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ, రహదారి ప్రణాళికలపై వెంటనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే హైదరాబాద్‌ను పొగడడంపై అందరూ ఏకీభవించలేదు. కొందరు స్థానికులు స్పందిస్తూ ఆదివారం రోజుల్లో ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని, వర్షాలు పడిన సమయంలో నగర పరిస్థితి పూర్తిగా మారిపోతుందని తెలిపారు. త్వరలో హైదరాబాద్ కూడా ట్రాఫిక్ సమస్యల్లో బెంగళూరు స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.

Advertisement

వివరాలు 

హైదరాబాద్‌ రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పు

హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా చేపట్టిన రహదారి అభివృద్ధి పనులు నగర రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విశాలమైన రహదారులు, ఫ్లైఓవర్లు, బహుస్థాయి వంతెనలు, వేగవంతమైన ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం నగర ప్రయాణాన్ని సులభతరం చేశాయని చెబుతున్నారు. మొత్తంగా ఓ బెంగళూరు టెక్కీ చేసిన ఈ పోస్ట్ రెండు మహానగరాల మౌలిక సదుపాయాల మధ్య ఉన్న తేడాలను మరోసారి ప్రజల ముందుకు తీసుకొచ్చింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆర్చీ సేన్‌గుప్తా చేసిన ట్వీట్ 

Advertisement