
Hyderbad : 'కేటీఆర్‌కు చెప్పినా పట్టించుకోలే..గోడపై సూసైడ్ నోట్ రాసి కుటుంబం ఆత్మహత్య'
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది.గంగపుత్ర కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.
తమ చిన్నారికి మొదట ఉరివేసిన తల్లిదండ్రులు, ఆపై ఆ ఇద్దరూ బలవన్మరణానికి ఒడిగట్టారు. మృతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా పరిధి లక్ష్మీపురం వాసులుగా గుర్తించారు.
ఈ ఘటన వారసిగుడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతులు భర్త కొప్పుల సాయికృష్ణ , భార్య చిత్రకళ, కూతురు తేజస్వినిగా సమాచారం. అయితే చిన్నారికి 4 ఏళ్ల వయసు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
మృతురాలు చిత్రకళ, బిర్లా ప్లానిటోరియంలో ఉద్యోగినిగా కొనసాగుతున్నారు. భర్త సాయి కృష్ణ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల కింద సాయికృష్ణను యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించేసింది.
Details
భర్త ఉద్యోగం పోవడంతో రాపిడోలో చేరాడు
ఈ క్రమంలోనే కుటుంబ నిర్వహణ కోసం సాయికృష్ణ టూ వీలర్ క్యాబ్ సర్వీస్ (రాపిడో) నడుపుతున్నారని సమాచారం.
తాజాగా సాయికృష్ణ భార్య. చిత్రకళను కూడా బిర్లా ప్లానిటోరియం ఉన్నతాధికారులు ఉద్యోగంలో నుంచి తీసివేశారు.
దీంతో కుటుంబం ఆందోళన తీవ్రమైంది. ఆర్థిక సమస్యల నేపథ్యంలోనే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డట్లు స్థానికులు పేర్కొన్నారు.
చిత్రకళను, బిర్లా ప్లానిటోరియంలోని అధికారులు శ్యామ్ కొఠారి, గీతారావులు నిత్యం వేధింపులకు గురిచేశారని, తమపై తప్పుడు ఆరోపణలు మోపి ఉద్యోగం నుంచి తొలగించారని లేఖలో భార్యభర్తలు పేర్కొన్నారు.
అంతటితో ఆగకుండా రకరకాలుగా వేధింపులు కొనసాగించారని, ప్లే స్లిప్ లు సైతం ఇవ్వలేదని లేఖలో పొందుపర్చారు.
details
మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేస్తే పట్టించుకోలేదు : బాధిత కుటుంబం
తమకు ఆఫర్ లెటర్ ఇవ్వకుండా వేధించారని, ఈ క్రమంలోనే తీవ్ర మనోవేదనతో బిర్లా సైన్స్ సెంటర్ లోని అక్రమాలపై చాలా సార్లు మంత్రి కేటీఆర్ కు ట్విట్ చేశామని వివరించారు.
అయినప్పటికీ పట్టించుకోలేదంటూ జరిగిన విషయాలను సూసైడ్ నోట్ గా రాశారు.
ఉద్యోగం పోయిన కారణంగా చిత్రలేఖ డిప్రెషన్ లోకి వెళ్లిందని, ఉద్యోగంలో వేధింపుల కారణంగా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లేఖ రాయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను ఫ్యామిలీకి అప్పగించనున్నారు.