Page Loader
KTR: కేటీఆర్ ఇంటి వద్ద హైడ్రామా.. బీఆర్ఎస్ నేతలు అరెస్టు
కేటీఆర్ ఇంటి వద్ద హైడ్రామా.. బీఆర్ఎస్ నేతలు అరెస్టు

KTR: కేటీఆర్ ఇంటి వద్ద హైడ్రామా.. బీఆర్ఎస్ నేతలు అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2024
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ ఓరియన్‌ విల్లాస్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాసం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండా లోనికి వెళ్లేందుకు వారు ప్రయత్నించారని తెలిసి, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్‌ తాము ప్రశ్నించగా పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆరోపణలు చేశారు. పోలీసుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ఎమ్మెల్యేలను నెట్టుకుంటూ లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు.

Details

బాల్క సుమన్ అరెస్టు

ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదం మరింత ఉద్రిక్తతను పెంచింది. బీఆర్‌ఎస్‌ నేతలు కేపీ వివేకానంద, బాల్క సుమన్‌, రాజు సాగర్‌, రాకేశ్‌, ఆశిష్‌ యాదవ్‌ తదితరులు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌ మండిపడి, సీఎం రేవంత్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.