Iltija Mufti: జమ్ముకశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓటమి చెందారు.
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి బషీర్ అహ్మద్ చేతిలో ఆమె ఓటమి నమోదు అయింది.
ఈ విషయాన్ని ఇల్తిజా అంగీకరించి, ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశార. తన గెలుపు కోసం కష్టపడిన పీడీపీ కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
వివరాలు
జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి ప్రభంజనం
జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి ప్రభంజనం కొనసాగుతున్నది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన ఈ కూటమి 90 స్థానాల నుండి 52 స్థానాలతో ముందంజలో ఉంది.
నేషనల్ కాన్ఫరెన్స్ - కాంగ్రెస్ కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. బీజేపీ 26 స్థానాల్లో దూసుకుపోతోంది. పీడీపీ నాలుగు స్థానాల్లో, ఇతర పార్టీలు ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇల్తిజా ముఫ్తీ చేసిన ట్వీట్
I accept the verdict of the people. The love & affection I received from everyone in Bijbehara will always stay with me. Gratitude to my PDP workers who worked so hard throughout this campaign 💚
— Iltija Mufti (@IltijaMufti_) October 8, 2024