LOADING...
CM Chandrababu: పీ4కు నేను భాగస్వామినే... బంగారు కుటుంబాల దత్తతకు ముందుకొచ్చిన నేత
పీ4కు నేను భాగస్వామినే... బంగారు కుటుంబాల దత్తతకు ముందుకొచ్చిన నేత

CM Chandrababu: పీ4కు నేను భాగస్వామినే... బంగారు కుటుంబాల దత్తతకు ముందుకొచ్చిన నేత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2025
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

పేదరిక నిర్మూలన కోసం ఆవిష్కరించిన 'పీ4 (పావర్టీ ఫ్రీ ఫ్యామిలీస్)' కార్యక్రమంలో తానే స్వయంగా మార్గదర్శిగా మారుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తన కుటుంబ సభ్యులంతా కూడా మార్గదర్శులుగా వ్యవహరిస్తారని తెలిపారు. తన నిర్ణయం మరిన్ని సంపన్నులను ప్రేరేపించి ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా మారేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక ప్రకటనలు శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ ప్రత్యేకాధికారులతో మాట్లాడుతూ పీ4పై సమగ్రంగా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా '#IAmAMaragadarsi' క్యాప్షన్‌తో కూడిన పీ4 పోస్టర్‌, లోగోను ఆవిష్కరించారు. తన చొక్కాపై ఆ లోగోను ధరించడం ద్వారా ప్రజల్లో మద్దతు పెంచే ప్రయత్నం చేశారు.

Details

కుప్పంలో 250 కుటుంబాలు దత్తత 

పీ4 అమలులో భాగంగా తన నియోజకవర్గమైన కుప్పంలో 250 బంగారు కుటుంబాలను స్వయంగా దత్తత తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుంచి మొదటి దశలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎంనుంచి ఎమ్మెల్యే వరకూ అందరూ యథాశక్తిగా పాల్గొనాలని సూచించారు.

Details

 పీ4కు భారీ లక్ష్యం: 2 లక్షల మార్గదర్శులు అవసరం 

ఇప్పటి వరకు 57,503 మంది మార్గదర్శులు నమోదు కాగా, 5,74,811 బంగారు కుటుంబాలు దత్తతకు నోమినేట్ అయ్యాయి. ఆగస్టు 10 లోపు సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు తమ స్వగ్రామాల్లోని కుటుంబాలను దత్తత తీసుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. రాష్ట్రస్థాయి దాతల కోసం కామన్ ఫండ్ఏ ర్పాటు చేయాలని సూచించారు. పీ4లో భాగస్వాములైన కేపీఎంజీ, మిలాప్, తమ్మడ, భవ్య, భార్గో, ప్రాజెక్టు డీప్‌ సంస్థల పాత్ర మరింత కీలకమని పేర్కొన్నారు.