Vinesh Chandel: బెంగాల్ ఎన్నికల వేళ ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహ సంస్థ ఐ-ప్యాక్‌కు చెందిన సహ వ్యవస్థాపకుడు,నిర్వాహకుడు వినేష్ చందేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. బెంగాల్ బొగ్గు అవినీతి వ్యవహారానికి సంబంధించిన అక్రమ ధన లావాదేవీల కేసులో భాగంగా సోమవారం రాత్రి ఢిల్లీలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంగళవారం ఆయనను ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ నిరోధక చట్ట న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. బొగ్గు అక్రమ రవాణా ద్వారా వచ్చిన భారీ మొత్తంలో నిధులను హవాలా మార్గాల ద్వారా ఐ-ప్యాక్ నమోదిత సంస్థకు మళ్లించారని వినేష్ చందేల్‌పై ఈడీ ఆరోపిస్తోంది.
వివరాలు
ఇది రాజకీయ కక్ష సాధింపే: తృణమూల్ కాంగ్రెస్
2020లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ మనీలాండరింగ్ కేసుపై దర్యాప్తు చేస్తోంది. ఎన్నికలకు కేవలం పదిరోజుల ముందు ఈ అరెస్ట్ జరగడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈఅరెస్ట్‌పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది రాజకీయ కక్ష సాధింపే అని విమర్శించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ,'ఎన్నికలకు కేవలం పది రోజుల ముందు ఈ అరెస్ట్ జరగడం స్వేచ్ఛాయుత ఎన్నికల స్ఫూర్తిని దెబ్బతీస్తుంది.ఇది ప్రజాస్వామ్యానికి అనుకూలం కాదు,బెదిరింపు చర్య'అని సామాజిక మాధ్యమ వేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం వినేష్ చందేల్ ఈడీ కస్టడీలో ఉండగా,నిధుల మళ్లింపుపై అధికారులు మరింత విచారణ చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా,బెంగాల్‌లో ఏప్రిల్ 23,29 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అభిషేక్ బెనర్జీ చేసిన ట్వీట్
The arrest of Vinesh Chandel, co-founder of I-PAC, barely 10 days before the Bengal elections, is not just alarming- It shakes the very idea of a level playing field.
— Abhishek Banerjee (@abhishekaitc) April 13, 2026
At a time when WB should be moving toward free and fair elections, this kind of action sends a chilling message:…