Kota:: 'అమ్మా నాన్న, జేఈఈ నా వల్ల కాదు.. జేఈఈ, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్‌లోని కోటాలో సోమవారం నాడు 18 ఏళ్ల జేఈఈ ఔత్సాహిక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాను జేఈఈ చేయలేనని తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసింది. పరీక్షకు రెండు రోజుల ముందు ఆమె ఆత్మహత్య చేసుకుంది. కోటాలో దాదాపు వారం రోజుల్లో ఇది రెండవ ఆత్మహత్య. జేఈఈ మెయిన్స్‌కు సిద్ధమవుతున్న బాధితురాలు కోటలోని శిక్షానగరి ప్రాంతంలోని తన ఇంటి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె పరీక్ష జనవరి 31న జరగాల్సి ఉంది. ఆమెను 18 ఏళ్ల నిహారికగా గుర్తించారు.
జనవరి 23న ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఆత్మహత్య
పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో,నిహారిక తాను ఒక వరస్ట్ కూతురిని, ఇదే తనకు లాస్ట్ ఆప్షన్' అని రాసింది. "అమ్మా నాన్న నేను జేఈఈ చేయలేను.నేను ఓడిపోయాను అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను మంచి కూతురిగా ఉండలేకపోయాను.క్షమించండి అమ్మా నాన్న.ఇదే చివరి ఆప్షన్" అని నోట్‌లో ఉంది. అంతకముందు,జనవరి 23న కోటాలో ప్రైవేట్ కోచింగ్ ద్వారా నీట్‌కు సిద్ధమవుతున్న ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంజినీరింగ్,మెడికల్ ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు పేరుగాంచిన కోటాలో 2023లో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు.