
Cancellation of visa: ఇక్కడే ఓటేశాను.. నన్నెందుకు పంపిస్తున్నారు..? వీసా రద్దుతో పాక్ యువకుడి వేదన!
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ పౌరుల వీసాల్ని రద్దు చేయడంతో, ఓ పాకిస్తానీ యువకుడు భారత్ విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఈ నేపథ్యంలో తనకు భారతీయ పౌరుడిగా ఎన్నో హక్కులు ఉన్నాయని, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నానని చెబుతూ ఆ యువకుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఆయన తన పేరును ఒసామాగా పరిచయం చేసుకున్నాడు. నేను 17 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాను. స్కూల్ చదువు ఇక్కడే పూర్తిచేశాను. ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నాను. ఓటు హక్కు వినియోగించుకున్నాను.
నాతో పాటు నా కుటుంబానికి రేషన్ కార్డు ఉంది. అలాంటప్పుడు నన్నెందుకు పాకిస్థాన్ పంపుతున్నారు? అక్కడ నాకు భవిష్యత్తే లేదు" అంటూ వాపోయాడు.
Details
వలస దారుల హక్కులపై ప్రశ్నలు
వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. ఓ పాకిస్తానీ పౌరుడు ఎలా ఓటు హక్కును వినియోగించుకున్నాడు? అతడికి ఎలా రేషన్ కార్డు జారీ అయ్యింది? అనే ప్రశ్నలు ఊపందుకున్నాయి.
ఇది ఎన్నికల భద్రతపై, దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల హక్కులపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Details
భారత్-పాక్ సంబంధాలపై ప్రభావం
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ బైసారన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. ఈ దాడికి పాక్ ఆధారిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించింది.
అయితే ఏప్రిల్ 26న TRF ఆ ప్రకటనను ఉపసంహరించుకుని తమ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పింది. దీంతో భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై భారీ ఆపరేషన్ ప్రారంభించింది.
దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్థాన్‌కు చెందినవారు కాగా, మూడో వ్యక్తి కాశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఆయన నివాసంతో పాటు మరికొంతమంది ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా దళాలు కూల్చివేశాయి.